ఫీల్డ్ అసిస్టెంట్ లో తిరిగి విధుల్లోకి తీసుకోవాలి....రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి

 ఫీల్డ్ అసిస్టెంట్ లో తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం లో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి అన్నారు. బుధవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో భాగంగా వారిని ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం వలన వారి జీవన జీవన ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. కావున ప్రభుత్వం స్పందించి వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ లక్షల సంఘం మండల అధ్యక్షుడు రాము నాయక్. రవి . సత్తయ్య .గోవిందు.సాయినాథ్.పాల్గొన్నారు.