డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించండి-

 డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించండి- 

 మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని వివిధ పెట్రోల్ బంక్ ల దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించిన ఉమ్మడి గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత ఆరు నెలల్లో నలభై మూడు సార్లు పెంచడం జరిగిందని సామాన్య ప్రజల పట్ల ఎందుకింత బారం మోపుతున్నారు. సామాన్య ప్రజలు తమ యొక్క జీవనం గడవాలంటే రెండు చక్రాల బండి నడవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం ధరలు పెంచుతూ పోతే సామాన్య ప్రజల బతుకు ఎక్కడికి వెళ్లాలి. ఈ చమురు ధరలు తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ,పరిగి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసనలో ఉమ్మడి మండల కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు కే ఎం నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కమతం విష్ణువర్ధన్ రెడ్డి , మన్యపు రెడ్డి , రవి, కోఆప్షన్ మెంబెర్ మాజీ    వర్కింగ్ ప్రెసిడెంట్  జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉష, సంయుక్త కార్యదర్శి ఎం రాఘవేందర్ రెడ్డి ,   ఆంజనేయులు, కే చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నవారు.