పి ఈ టి ల ఉన్నతీకరణ పదోన్నతుల జీ వో ను వెంటనే అమలు చేయాలి....

పి ఈ టి ల ఉన్నతీకరణ పదోన్నతుల జీ వో ను వెంటనే అమలు చేయాలి....
వ్యాయామ విద్య ఉపాధ్యాయుల ఉన్నతీకరణ పదోన్నతుల జీవోలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూమర్ల నిరంజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు మాడ్రన్ హైస్కూల్  లో జరిగిన తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశనికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, పదోన్నతుల కోసం  ఉన్నతీకరణ కోసం జీవోలు విడుదల అయినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల అమలు అమలు కావడం లేదని రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఉన్నత అధికారులు వెంటనే స్పందించి    విధివిధానాలను  రూపొందించి వ్యాయామ విద్య ఉపాధ్యాయుల చిరకాల ఆకాంక్షను తీర్చాలని కోరారు . ఏజెన్సీ నాన్ ఏజెన్సీకి సంబంధించిన సమాచారంలో   న్యాయపరమైన చిక్కులు లేకుండా విధివిధానాలను రూపొందించాలని కోరారు .అదేవిధంగా గా గురుకుల పాఠశాలలో అమలవుతున్న మెనూ ను ప్రభుత్వ  పాఠశాల మధ్యాహ్న భోజనంలో అమలు చేయాలని కోరారు  . క్రీడాకారుల  ప్రత్యేక శిక్షణకు నైపుణ్యాల అభివృద్ధికి ఉన్నత పాఠశాల కు 25000 ప్రాథమికోన్నత పాఠశాల కు 15000 ప్రాథమిక పాఠశాలకు 10000 ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక పి డి ని ఒక పీఈటీ ని నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన మండల కేంద్రాలలో నూతనంగా పి డి లు నియమిస్తూ గతంలో ఉన్న మండల క్రీడా అభివృద్ధి అధికారి పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఆర్విఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న పి ఈ టి లకు కరోనా దృశ్య వేతనాలను మంజూరు చేయాలని కోరారు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడాకారులకు వారి అర్హతను బట్టి సరిపోయిన సూపర్ మెమొరీ ఉద్యోగాలను సృష్టించాలని కోరారు క్రీడాకారులకు ఉద్యోగాలలో విద్యలో కేటాయించిన 2 శాతం కోటాను ఐదు శాతం పేంచి ప్రతి ప్రభుత్వ శాఖలొ అమలు అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అ అసోసియేట్ అధ్యక్షులు జి ఏ విలియం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య నారాయణపేట జిల్లా అధ్యక్షులు రమణ మహిళ జిల్లా అధ్యక్షురాలు శశికళ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు మోయి న్ ఆనంద్ .శంకర్. సత్యనారాయణ .శ్రీనివాసులు రమాదేవి. తదితరులు పాల్గొన్నారు