పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి...
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి...
ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మండల కేంద్రములో టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను మరియు నిత్యావసర ధరలను తగ్గించాలని పెట్రోల్ బంకు ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ టీ పీసీసీ కార్యదర్శి నిత్యానందం,బూర్ల వెంకటయ్య జడ్చర్ల మున్సిపల్ కౌన్సిలర్లు 16వ వార్డు కౌన్సిలర్ సభ్యులు ఎం డి రహీమ్ ఉద్దీన్ 27వ వార్డు కౌన్సిలర్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్లు డి శ్రీను,విజయ భాస్కర్ రెడ్డి,శాగంటి రఘు, నరసింహ యాదవ్,నసీర్, యువ నాయకులు కృష్ణారావు, కింగ్ కాజా, రాఘవేందర్, నరేందర్, కాజా అలీమ్ ఉద్దీన్, యాదయ్య మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు నిరసన ప్రదర్శనలు చేయాలనే పిలుపులో భాగంగా ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల వలన ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాల న వలన ఈ ధరలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుమారు 45 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు వంద రూపాయలదాటుతుంది. డీజిల్ కూడా సుమారు 100 శాతం పెరిగింది దీనివలన రవాణా ఛార్జీలు పెరగడం తో పాటు నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అని దీనివలన సామాన్య పేద ప్రజలు లు బ్రతక లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెంచిన జి ఎస్ టి వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కరుణ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది