పాఠశాలలో పని చేసే ప్రతి ఒక్కరికి సహాయం అందించాలి...

 పాఠశాలలో పని చేసే ప్రతి ఒక్కరికి సహాయం అందించాలి... ఇంచార్జ్ డీఈవోను కలిసిన ట్రాస్మా నాయకులు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అందించాలని  మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి డీఈఓ  అనసూయ, సూపరిండెంట్ శంభు ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లా ,మరియు మండల ట్రస్మా నాయకులు ఈ సందర్భంగా వారు ఇటీవల అపత్కాల సందర్భంగా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అటెండెన్స్, అక్వీటేన్స్ ప్రకారం ప్రభుత్వం అందజేస్తున్న రెండు వేల రూపాయలు 25 కేజీల బియ్యాన్ని అందించాలని కోరారు వినతి పత్రం అందజేసిన వారిలో ట్రస్మాజిల్లా అధ్యక్షులు ప్రభాకర్, సెక్రెటరీ వెంకట్ రెడ్డి, గండీడ్ మండల్ అధ్యక్షులు అంజి రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు ఆయా పాఠశాలల్లో కరస్పాండెంట్ లు ఉన్నారు