పతాక స్థాయికి చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం...

పతాక స్థాయికి చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం...వార్డుల్లోకలయ  తిరుగుతున్న కౌన్సిలర్ అభ్యర్థులు దగ్గర ప్రచార గడువు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్నది. వార్డుల కౌన్సిలర్లు గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పోటాపోటీగా పట్టణంలోని 27 వార్డుల్లో ప్రచారం కొనసాగుతుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థులు 27 వార్డుల్లో ప్రచారం కొనసాగిస్తుండగా బిజెపి,కాంగ్రెస్,మజ్లీస్ పార్టీల నాయకులు తమ పార్టీల అభ్యర్థుల పోటీలో ఉన్న వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 2,3 వార్డుల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అంతే కాక ప్రతి రోజు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారి ప్రచారాన్ని గురించి ఆరా తీస్తూ ప్రచారంలో వెనుకబడిన వారికి మద్దతుగా ఆ వార్డుల్లో ప్రచారం చేస్తూ అభ్యర్థుల్లో మనోధైర్యాన్ని నెలకొల్పుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఈ విధంగా కొనసాగుతుండగా, బీజేపీ అభ్యర్థులు పట్టణంలో గతంలో పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో, ప్రస్తుతం పరిపాలిస్తున్న టిఆర్ఎస్ హాయాంలో పట్టణంలో అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందనే విషయాలను గురించి వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు.  బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పలుమార్లు పట్టణంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా ఆ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జి అనిరుద్ రెడ్డి,కాంగ్రెస్ ఓబిసి సెల్ అధ్యక్షుడు బాలవర్ధన్ గౌడ్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు తేదీ దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీల నాయకులు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు కేవలం ఒకే వైపు ఉంటాయని బిజెపి, కాంగ్రెస్ పార్టీల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని అందరూ భావించారు. అనూహ్య పరిణామాల మధ్య బిజెపి కాంగ్రెస్ నాయకులు తమ పార్టీల అభ్యర్థులను పెద్ద ఎత్తున పోటీలో నిలవడంతో పాటు వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తుండడంతో ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొన్నది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండడంతో అంతా ఆసక్తికరంగా ఎన్నికల పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.