పంచముఖి పార్క్ ను ప్రారంభించిన మంత్రి వీ . శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీ లో నూతనంగా నిర్మించిన పంచముఖి పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ S. వెంకటరావు, SP వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ. రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ KC నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేష్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.