పి యు లో పునుగుపిల్లి మరణం....

పి యు లో పునుగుపిల్లి మరణం.... జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అరుదైన జాతి పునుగు పిల్లి గురువారం నాడు ప్రమాదవశాత్తు, విద్యుత్ తీగలకు తగిలి మరణించింది. పాలమూరు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సుమారు 10 వరకు పునుగు పిల్లులు ఉంటాయని విశ్వవిద్యాలయ అధికారులు తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు గతంలో వాటిని సంరక్షించడానికి నాలుగు పునుగు పిల్లలను విశ్వవిద్యాలయం నుండి సేకరించారు.  పునుగు పిల్లుల ను అటవీశాఖ అధికారులు సేకరించి వాటిని సంరక్షించాలి అని కోరారు.