నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి సన్మాన సభ .....

 నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి సన్మాన సభ  మిడ్జిల్ మండలం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సభ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్.రాజేశ్వర్ గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని పార్టీ ఎల్లవేళలా గుర్తిస్తూనే ఉంటుంది ఎటువంటి తారతమ్యాలు చూడకుండా పార్టీని బలోపేతం చేసే నాయకులకే అధిష్టానం పదవులను కట్టబెడు తుందని దానికి నిదర్శనంగా ఈ రోజు మిడ్జిల్ గ్రామ నాయకుడు పల్లె తిరుపతి గారిని రాష్ట్ర పార్టీ గుర్తించి వారికి బీజేవైఎం కార్యవర్గ సభ్యులుగా పదవిని ఇచ్చిందని ఇలాగే ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు ఎటువంటి తారతమ్యాలు లేకుండా పార్టీ కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్ బాగుంటుందని అలాగే ఇంతటి తోనే కాకుండా ఇంకా మరెన్నో పదవులను అలంకరించాలని పార్టీ ప్రతిష్టను పెంచాలని మీడియా పాత్రికేయులు సమక్షంలో మాట్లాడడం జరిగింది, అలాగే నూతనంగా ఎన్నికైన బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి గారు మాట్లాడుతూ పార్టీ నన్ను నమ్మి నా పైన ఇంతటి పెద్ద బాధ్యతను నాపై ఉంచి నందుకు ముందు ముందు మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, యువత దేశ ధర్మం కోసం కట్టుబడి ఉండాలని యువకులు అంతా బీజేపీతోనే కలిసి నడవాలని తనకు ఇంత పెద్ద బాధ్యత రావడానికి జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తలు కృషి అని మీడియా పాత్రికేయుల అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం రాజేశ్వర్ గారు మండల ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, ఎలిశెట్టి రాములు, మండల అధికార ప్రతినిధి వాసుదేవ్ అన్నగారు, దళిత మోర్చా అధ్యక్షుడు విష్ణు, కిసాన్మోర్చా అధ్యక్షులు వెంకట్ రెడ్డి అన్న గారు, గిరిజన మోర్చా నాయకులు భాస్కర్, శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, మండల నాయకులు జగన్, శ్రీశైలం, పల్లె శ్రీను, రామ్, శేఖర్, యాదయ్య, జావిద్, జంగయ్య, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు