నూతన మండలం చేసినందుకు ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కు పాలాభిషేకం

నూతన మండలం చేసినందుకు ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కు పాలాభిషేకం

గండీడ్   మహమ్మదాబాద్ ను నూతన మండలంగా ఏర్పాటు   చేసినందుకు ఆదివారం హర్షం వ్యక్తం చేస్తూ  మహమ్మదాబాద్ గ్రామస్తులు, టిఆర్ఎస్ నాయకులఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ముఖ్యమంత్రి కెసిఆర్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చిత్రపటాలకు  పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన మండల ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి అలాగే మండలం ఏర్పాటుకు కృషిచేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపి మాధవి, మాజీ కో ఆప్షన్ గఫర్ ఖాన్, డిజెబుల్ రూరల్ డెవలప్మెంట్ జిల్లా అధ్యక్షుడు దనకరి రవి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, జులపల్లి సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, మమదాబాద్ ఎంపీటీసీ చెన్నయ్య, మంగంపేట్ సర్పంచ్ శ్రీనివాస్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు