నూతన కలెక్టరేట్ కార్యాలయ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ వెంకట్ రావు ..
నూతన కలెక్టరేట్ కార్యాలయ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి కలెక్టర్ కార్యాలయ ఆవరణ ముందు జరుగుతున్న అంతర్గత రహదారి పనులు, హేలిప్యాడు ,ఆర్చ్,సుందరీకరణ పనులను తనిఖీ చేశారు. నూతన కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న నీటి గుంతలను పూడ్చివేయాలని నీరు నిల్వ ఉండకుండా మళ్ళించాలని, పక్కనే ఉన్న సబ్ స్టేషన్ ను ఇతర చోటికి మార్చాలని చెప్పారు. లాన్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సాధ్యమైనంత త్వరలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అంతేకాక మహబూబ్ నగర్- భూత్పూర్ రహదారిపై రోడ్డు మధ్యలో డివైడర్ పై పెద్ద మొక్కలను నాటించాలని, రహదారికిరుపక్కల వివిధ వరుసల్లో మొక్కలు నాటాలని,కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కూడా పలు వరసలో పెద్ద పెద్ద మొక్కలు నాటించాలన్నారు. అంతేకాక నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద బస్ బే ని నిర్మించాలని, అన్ని విషయాలలో ఇతర జిల్లాల కంటే మెరుగ్గా ఉండేలా నూతన కలెక్టరేట్ ను తీర్చిదిద్దాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డి,ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామి ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, తదితరులు ఉన్నారు.