నూతన కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో చుట్టూ మూడు వరుసల్లో మొక్కలు నాటాలి ... రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియల్....

నూతన కలెక్టరేట్ కార్యాలయం  ఆవరణలో చుట్టూ మూడు వరుసల్లో మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్  డోబ్రియల్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ లోని నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని  సందర్శించి లాన్ ఏర్పాటు, మొక్కల పెంపకం కై చేపట్టిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా నూతన  కలెక్టరేట్  ఆవరణలో ప్రహరీ చుట్టూ మూడు వరుసల్లో పగోడా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలని అన్నారు. పగోడా, వేప వంటి మొక్కలను నాటాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన సుందరీకరణ పనులకు కొన్ని సూచనలు సలహాలను చేశారు. కాంపౌండ్ వెలుపల రహదారికి కాంపౌండ్ కు మధ్య ఉన్న స్థలంలో యాదాద్రి తరహాలో మొక్కలను పెంచాలని  సూచించారు.  జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు  నూతన  కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అదేవిధంగా బయటివైపు చేపట్టనున్న మొక్కల పెంపకం ,లాన్ తదితర వివరాలను పి సిసిఎఫ్ కు వివరించారు.రాష్ట్ర కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్  గిరిజ, స్థానిక సంస్థల అద అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డిఎఫ్  ఓ గంగారెడ్డి,  ఆర్ అండ్ బి ఈ ఈ తదితరులు ఉన్నారు.