నూతన రైల్వే బ్రీడ్జ్ కమ్ ఫోర్ లైన్స్ రోడ్డు మంజూరు.
జడ్చర్ల పట్టణములో సిగ్నల్ గడ్డ దగ్గర నూతన రైల్వే బ్రీడ్జ్ కమ్ ఫోర్ లైన్స్ రోడ్డు మంజూరు. - ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి హరితహారం కార్యక్రమంలో భాగంగా బాదేపల్లి బాలుర హై స్కూల్ నందు 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి.జడ్చర్ల పట్టణములో అదనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, జడ్చర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కోసం ప్రతిపాదన. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బాదేపల్లి ప్రభుత్వ బాలుర హై స్కూల్ నందు 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్య శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు వార్డు కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం అక్షయ పాత్ర వారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థి, విద్యార్థులకు హెల్త్ కిట్ లను అందచేశారు.అనంతరం ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పట్టణములో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా సిగ్నల్ గడ్డ దగ్గర ఉన్న పాత రైల్వే బ్రీడ్జ్ స్థానంలో కొత్తగా నూతన బ్రీడ్జ్ మరియు నాలుగు లైన్ ల రోడ్డు మంజూరు అయ్యింది అని అన్నారు. అలాగే జడ్చర్ల పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది అని దీనికి అనుగుణంగా కొత్తగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ మరియు జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లను కలిపుతు కొత్త DSP స్థాయి అధికారి అఫిస్ కోసం ముఖ్యమంత్రి కి ప్రతిపాదించడం జరిగింది అని తెలిపారు. అనంతరం గంగాపూర్ గ్రామంలో రూ.8.00 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈద్గాను ఎమ్మెల్యే ప్రారంభించారు.