నిరుపేదలను ఆదుకోవడమే నా లక్ష్యం .... విలేకరులకు బియ్యం పంపిణీ చేసిన కుమ్మరి రాములు...
నిరుపేదలను ఆదుకోవడమే నా లక్ష్యం .... విలేకరులకు బియ్యం పంపిణీ చేసిన కుమ్మరి రాములు... క రో నా మహమ్మారి ఉన్నందువలన మండలంలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడమే నా లక్ష్యం అని వింజమూరు మాజీ సర్పంచ్ కుమారి రాములు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఉన్న ఆది ఆంజనేయ స్వామి దేవాలయంలో మండల విలేకరులకు 25 కిలోల సోనా బస్తాలను మాజీ సర్పంచ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు గుడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. మండలంలో గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఇలాంటి సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతరం మండలంలో విలేకరులకు ఇలాంటి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదని, మరొకసారి కరోనా సమయంలో విలేఖర్లకు బియ్యం అందించి మానవత్వం చాటుకున్న అందుకు మాజీ సర్పంచ్ కుమారి రాములుకు మండల విలేకరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ పల్లి తండా సర్పంచ్ కె వెంకట్ బాయ్, వింజమూరు ఉపసర్పంచ్ భీమయ్య, మండల విలేకరులు, రాఘవేంద్రరావు, నర్సింలు, రామకృష్ణ, కిరణ్, మల్లికార్జున్ గౌడ్ , పరంధరాములు తదితరులు పాల్గొన్నారు.