నేడు రైతు వేదికలు ప్రారంభోత్సవం....
నేడు రైతు వేదికలు ప్రారంభోత్సవం.... నూతనంగా నిర్మించిన రైతు వేదికలు గురువారం నాడు ప్రారంభించడం జరుగుతుందని ఎంపీపీ శశికళ భీ 0రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణయ్య తెలిపారు. రైతు వేదికలను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ . రాజేందర్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా మండలంలో ఉన్న మల్కాపూర్, గార్లపాడు , చంద్రాస్ పల్లి , అంకిళ్ల గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న సర్పంచులు , ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు , హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.