నేడు రైతు వేదికల ప్రారంభోత్సవాలు..... ప్రారంభోత్సవం చేయనున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ...

నేడు రైతు వేదికల ప్రారంభోత్సవాలు.....   ప్రారంభోత్సవం చేయనున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ...  మండలంలో నూతనంగా నిర్మించిన రైతు  వేదికలను శనివారం  ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీపీ శశికళ భీ 0  రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా కోయిలకొండ  లో ఉన్న పల్లె ప్రకృతి వనం , రైతు వేదిక , మోదీ పురం లో  అంజనేయ స్వామి జల్దీ ఉత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని , అనంతరం శే రీవెంకటాపూర్ లో రైతు వేదిక , సూరారం లో  రైతు వేదిక  ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న సర్పంచులు ఎంపిటిసిలు , టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.