నేడే ఆఖరి రోజు ఓటర్ లిస్టులో పేరు సరి చేసుకోండి...

 నేడే ఆఖరి రోజు ఓటర్ లిస్టులో పేరు సరి చేసుకోండి...

ఎంపీడీవో కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులు సమర్పించని వార్డులకు మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున
19 వార్డు లకు 19 పోలింగ్ బూతుల కోసము ఆయా గ్రామాల్లో పరిశీలన చేసినట్లు వివరించారు.
ఎన్నికలు జరుగుతాయి వెంటనే ఓటర్ లిస్ట్ లో అభ్యర్థుల అడ్రస్  తప్పుగా ఉంటే వెంటనే సరిచేసుకోవాలని   తెలిపారు. 
ఖాళీ అయిన వార్డ్ మెంబర్ స్థానాలు భర్తీ చేయడానికి ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు. ఎన్నికల జరిగే  వార్డు లో నివాసం ఉండి , వేరే  వార్డు లో  అడ్రస్ తప్పుగా పడితే వెంటనే సరిచేసుకోవాలని ఎంపీడీవో కోరారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో వార్డ్ మెంబర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
1,అగ్రహారం పొట్లపల్లి 2 వ వార్డు,
2,చోక్కంపేటా 1వ వార్డు 5 వ వార్డు 6 వ వార్డు
3, దొండ్ల పల్లి 3 వ వార్డు 8వ వార్డు
4, ఇద్గన్ పల్లి 1వ వార్డు 4వ వార్డు 5 వ వార్డు 6వ వార్డు 7 వ వార్డు
5, మల్లేపల్లి 5 వ వార్డు
6,మెత్కుల  కుంట తండా 4 వ వార్డ్
7, నాన్ చెరువు తాండ 1వ వార్డు 3 వ వార్డు
8, రాయపల్లి 4వ వార్డు
9, రాజాపూర్ 5వ వార్డు 6వ వార్డు 12వ వార్డు
రాజాపూర్ మండలం లోని మొత్తము 19 వార్డులో ఎన్నికలు జరుగుతాయని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి సుశీల రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, కో ఆప్షన్ అల్తాఫ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు లింగం, సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, ఎంపిఓ వెంకట్ రాములు, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.