నాటు సారా అమ్మితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం.

 నాటు సారా అమ్మితే  పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం....                                         10 లీటర్ల నాటుసారా స్వాధీనం  .....                                                                            ఎక్సైజ్ సీఐ బాలకృష్ణ , ఎస్సై మనోహర్ ...    మండలంలో  ఉన్న గిరిజన తండాలలో నాటుసారా తయారుచేసి అమ్మడానికి ప్రయత్నిస్తే, అట్టి వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఎక్సైజ్ సీఐ బాలకృష్ణ, ఎస్సై మనోహర్ హెచ్చరించారు . ఈ సందర్భంగా ఎక్సైజ్ సి ఐ , ఎస్సై మాట్లాడుతూ , ఆదివారం తెల్లవారుజామున రూట్ వాచ్ లో భాగంగా కోయిలకొండ మండలం లో ఉన్న వింజమూరు గేట్ వద్ద ఆటోలో నక్కల కుంట తండా కు చెందిన డి . హనుమంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిందితుడు ఇచ్చిన  సమాచారం మేరకు వింజమూరు కు చెందిన పెంటమ్మ ఇంట్లో సోదా చేయగా 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. హనుమంత్ అనే వ్యక్తి గతంలో తాసిల్దార్ ముందు బైండోవర్ అయ్యి మళ్ళీ కేసులో పట్టుబడడం జరిగిందని తెలియజేశారు.  లక్ష రూపాయల జరిమానా లేదా సంవత్సరం పాటు జైలు శిక్ష ఎమ్ ఆర్ ఓ సమక్షంలో ఉంటుందని తెలియజేశారు.  ఎవరైనా మొదటిసారి బైండోవర్  అయ్యి, రెండోసారి పట్టుబడితే లక్ష జరిమానా తో పాటు సంవత్సరం జైలు శిక్ష అనుభవిస్తారని తెలిపారు. సారా తయారు చేయడం  కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని వారుహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసులు రెడ్యానాయక్, అంజయ్య నాగరాజు , యాదయ్య, పాల్గొన్నారు