రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలి .... రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...
రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ మరియు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మార్కెటింగ్ శాఖ ,మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉదృతంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. అంతేకాక రైతులకు తక్షణమే డబ్బులు చెల్లించే ఏర్పాటు కూడా చేసిందని అన్నారు. రైతులు నాణ్యమైన దాన్యాన్ని కొనుగోలు కేంద్రాల కి తీసుకు రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బాలమణి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ జగదీష్ తదితరులు హాజరయ్యారు.