నల్లచెరువులో మరో మృతదేహం లభ్యం ...
నల్లచెరువులో మరో మృతదేహం లభ్యం ...
కావేరమ్మపేట సమీపంలోగల నల్లచెరువులో సోమవారం మరో మృతదేహం లభించింది. గోప్లాపూర్ గ్రామానికి చెందిన కటికల శేఖర్ మృతదేహం లభించిన మూడు రోజులకే మరో మృతదేహం నీటిపై తేలాడుతూ కనిపించడం మిస్టరీగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే రెండు మృతదేహాలు చెరువులో లభించడం అందరిని ఆలోచింపజేస్తుంది. సోమవారం చెరువు నీటిలో లభించిన మృతదేహం కూడా గుర్తుతెలియని వ్యక్తిది కావడం వల్ల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహం 35 సంవత్సరాల వయస్సు గల పురుషుడిది.మృతుడి ఒంటిపై బ్లూ కలర్ షర్టు, నల్లని ప్యాంటు కలవు. గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.