నకిలీ విత్తనాలు అమ్మి రైతుల ప్రాణాలతో చెలగాటమాడే సంఘ వ్యతిరేకుల పట్ల కఠిన చర్యలు తప్పవు .... జిల్లా ఎస్.పి. శ్రీ రావిరాల వెంకటేశ్వర్లు....

కర్షకుల బాగోగుల గురించి పట్టింపు లేకుండా నకిలీ విత్తనాలు అమ్మి రైతుల ప్రాణాలతో చెలగాటమాడే సంఘ వ్యతిరేకుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్.పి. శ్రీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. నేటి మధ్యాహ్నం రాష్ట్ర డి.జి.పి. శ్రీ ఎం.మహేందర్ రెడ్డి  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నకిలీ విత్తనాలను అమ్మే వ్యాపారులపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో గత పదిహేను రోజులుగా వివిధ మండల కేంద్రాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలోనూ చేపట్టిన తనిఖీల గురించి ఎస్.పి. వివరిస్తూ...జిల్లాలో పద్దెనిమిది ప్రత్యేక బృందాల ఏర్పాటు.ఒకేరోజు ఏకబిగిన జిల్లావ్యాప్తంగా ఉన్న దుకాణాలు, విత్తన తయారీ కేంద్రాలు, వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు.ముందస్తు సమాచారం సేకరించి నిర్వహించిన దాడులలో ఇరవై ఎనిమిది కేసుల నమోదు. ఇరవై ఎనిమిది మంది నిందితుల అరెస్టు.ఈ సందర్భంగా సుమారుగా యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ అనుమతి లేని నకిలీ మరియు కాలం చెల్లిన పత్తి విత్తనాలతో పాటుగా ఇతర విత్తనాలు స్వాధీనం.రానున్న కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలోనూ గట్టి నిఘా. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారులను గుర్తించేందుకు చర్యలు. ఈసందర్భంగా జిల్లా పోలీసు చేపట్టిన చర్యల పట్ల డి.జి.పి.  అభినందనలు తెలియజేస్తూ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృషి చేసిన సిబ్బందికి ప్రభుత్వం, శాఖ పక్షాన రివార్డుల ద్వారా గుర్తింపు ఉంటుందని ప్రకటించారు.నకిలీ విత్తనాలను నిర్మూలించే ప్రభుత్వ ఆలోచనను అమలు చేయడంలో మహబూబ్ నగర్ జిల్లా పోలీసు పని తీరుకు డి.జి.పి. అభినందనలు.ఈ సమావేశంలో ఎస్.బి. అడిషనల్ ఎస్.పి. శ్రీ లక్ష్మీనారాయణ, డి.ఎస్.పి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.