నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే....ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు....
నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే....ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు....
నకిలీ విత్తనాల ద్వారా రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు కృతనిశ్చయంతో ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పోలీసు, వ్యవసాయ అధికారుల సమావేశంలో ఎస్.పి. గారు మాట్లాడుతూ, మనమంతా రైతు కష్టం, అతనిలోని ఆతృతతో పాటుగా రైతు యొక్క గొప్పతనం తెలిసినవారమని, అటువంటి రైతును నకిలీ విత్తనాలతో మోసం చేసేవారిని కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవరించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం వివరించారు. ఇప్పటికే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో జిల్లాలోని విత్తనాలను అమ్మే దుకాణాలు, తయారీ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారని, అదనంగా టాస్క్ ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్.పి. గారు తెలిపారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలను మినహా ఇతర రకం విత్తనాలు మన జిల్లాలో అమ్మడానికి ఆస్కారం లేదని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పి.డి. చట్టం ప్రయోగించక తప్పదని ఎస్.పి. గారు హెచ్చరించారు. మండల స్థాయిలోని పోలీసు అధికారులు ప్రతి గ్రామంలో నిఘా ఉంచుతారని, ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వ్యవసాయ, పోలీసు శాఖలు ఉమ్మడిగా, వేర్వేరుగా తనిఖీలు నిర్వహించడం వలన మోసాలను అరికట్టవచ్చునని ఎస్.పి. గారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచన మేరకు నకిలీ విత్తనాలను పూర్తిగా నిరోధించి, రైతులకు అండగా ఉండేందుకు మన చర్యలు సాగాలని ఎస్.పి. గారు అన్నారు. ఈసందర్భంగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ వెంకటేష్ గారు నకిలీ విత్తనాలను గుర్తించే విధానం, పరికరాల గురించి తెలిపారు. రైతుల మేలు కొఱకు ఎస్.పి. గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో డి.ఎస్.పి. జి.శ్రీధర్, పోలీసు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.