నకిలీ విత్తనాల నిరోధానికి పద్నాలుగు టాస్క్ఫోర్స్ బృందాలు....ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు...

నకిలీ విత్తనాల నిరోధానికి పద్నాలుగు టాస్క్ఫోర్స్ బృందాలు....ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు...
నకిలీ విత్తనాల నిరోధానికిగానూ తీసుకొనవలసిన చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర డి.జి.పి. శ్రీ ఎం.మహేందర్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి సుచరిత గారు పాల్గొన్నారు.
ఈసందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు మాట్లాడుతూ, రైతులు మోసపోకుండా మేలు చేకూర్చే దిశలో పోలీసు, వ్యవసాయ శాఖ ఉమ్మడిగా కృషి చేయాలని సూచించారు. రైతును రాజు చేయాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని, రైతన్నలను మోసం చేసేందుకు ప్రయత్నించే సంస్థలు, వ్యాపారులు, వ్యక్తులపై ఏమాత్రం కనికరం చూపకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో... ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, నకిలీ విత్తనాలను అమ్మే ప్రయత్నం చేసిన విషయమై జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 27 కేసులు నమోదు అయ్యాయని, గత ఏడాది (2020) లో ఎనిమిది కేసులు నమోదవ్వగా, ఒక వ్యక్తిపై పి.డి. చట్టం ద్వారా జైలుకు పంపించామని తెలిపారు. అదేవిధంగా నకిలీ విత్తనాలను నిరోధించడానికి పోలీసు, వ్యవసాయ శాఖతో సమన్వయం చేస్తూ పద్నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ఈ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి సుచరిత గారు తెలిపిన విషయాలు, సూచనలు
డి జిల్లాలో 1,50,000 ఎకరాలలో పత్తి సాగు జరుగుతున్నది.
నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
లైసెన్స్ ఉన్న డీలర్ దుకాణాలలోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రశీదును అడిగి మరీ తీసుకోవడం,  అట్టి రశీదును పంట కాలం ముగిసేదాకా జాగ్రత్తగా దాచుకోవడం అత్యంత ప్రధానం.HT కాటన్ అమ్మకానికి ప్రభుత్వం నుండి అనుమతి లేదు. ఇట్టి విత్తనాలు అమ్మడంతో పాటుగా కొనడం నేరం అవుతుంది.డీలర్ తో సహా ఎవరితోనైనా సరే, ప్యాకింగ్ లేని విత్తనాలను కొనవద్దు. ఇలా అమ్మేవారి వివరాలు తక్షణమే మీ అధికారులకు చేరవేయండి.ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవు. ఆయా గ్రామాలు, మండల కేంద్రాలలో ఇటువంటి విత్తనాలను అమ్మే వ్యక్తులు ఉన్నారని తెలిసినా, అనుమానం ఉన్నా వెంటనే మీ పోలీసు, వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి. నకిలీ విత్తనాలను అమ్ముతూ రైతులను మోసం చేసేవారిపై క్రిమినల్ కేసులు తప్పవు. అవసరమైతే కఠినమైన పి.డి. చట్టంతో జైలుకు పంపించడం జరుగుతుంది.