ముసాపేట పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం ....గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్...
ముసాపేట పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ మరియు స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జెడ్పిటిసి ఎంపిపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయురాలు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం కృషి చేసినందుకు మరియు పాఠశాలలో గణిత పరంగా ఎన్నో అవార్డులు సాధించినందుకు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మరియు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు శ్రీమతి శోభా రాణి ఉపాధ్యాయురాలిని ఘనంగా సన్మానం చేసి ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో అవార్డులు సాధించి మంచిగా ఎదగాలని అభినందనలు తెలియజేశారు.