మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.... 66.60 శాతం పోలింగ్ నమోదు...

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.... 66.60 శాతం పోలింగ్ నమోదు...
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
పోలింగ్ సరళిని పరిశీలించిన అధికార,ప్రతిపక్ష పార్టీల నాయకులు
 బందోబస్తు చర్యలను పర్యవేక్షించిన  జిల్లా ఎస్పి.జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. భారీ బందోబస్తు మద్య కొనసాగిన ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కరోన వైరస్ భయం నెలకొని ఉన్న కూడా ఓటర్లు తమ నేతలను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో అనేక వ్యయ, ప్రయాసలకోర్చి ఓటింగ్ లో పాల్గొన్నారు.ఓట్లు వేయడానికి వచ్చిన  ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తో పాటు ఆయన సతీమణి శ్వేత,కుమారుడు స్వరణ్ రెడ్డి ఉదయం 9 గంటలకు  స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్  శాతం  60 66.గా నమోదయింది. పోలింగ్ సరళిని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పరిశీలించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తోపాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అనిరుద్ రెడ్డి తదితరులు కేంద్రాల వద్దకు చేరుకొని పోలింగ్ జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు.  జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పట్టణంలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు రాజకీయ పార్టీల నాయకులు,అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. రసవత్తరంగా జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లకు  చేరుకున్నాయి. ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. అంతవరకు అభ్యర్థులు, పట్టణ ప్రజలు ఫలితాలకోసం వేచి చూడవలసిందే.