ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...
అల్లాపూర్ గ్రామంలో వాగులో ఈత కోసం వెళ్లిన సాయికుమార్ ప్రమాదవశాత్తు మరణించిన సాయికుమార్ కుటుంబానికి ఆయన తండ్రి వెంకటేష్ గౌడ్ కు ముఖ్యమంత్రి సహాయనిధి 100000 చెక్కును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం అందజేశారు. మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సాయి కుమార్ మరణించడం జరిగింది. ఒక కొడుకు మరణించడంతో వెంకటేష్ గౌడ్ దిక్కు తోచని స్థితిలో అయోమయంలో పడ్డారు ఆయనను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించి మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి లక్ష రూపాయల చెక్కును అన్న సాగర్ లో తన సొంత స్వగృహంలో సాయి కుమార్ తండ్రి అయిన వెంకటేష్ గౌడ్ కు చెక్కును అందజేశారు. భరోసా ఇచ్చిన మాట ప్రకారం సహాయనిధి చెక్కు అందజేసి కుటుంబానికి అండగా ఉన్నానని నిరూపించుకున్నాడు అని ఆయనకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో అల్లిపురం గ్రామ సర్పంచ్ రఘు వర్ధన్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.