మొక్కలు నాటి వాటిని సంరక్షించే అలవాటు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి... జిల్లా కలెక్టర్ వెంకట్రావు....
మొక్కలు నాటడం వాటిని సంరక్షించటాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. శుక్రవారం మొక్కలకు నీరందించే దినం సందర్బంగా తన క్యాంపు కార్యాలయంలో ని మొక్కలకు నీరు పోశారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది, అలాగే ప్రజలు వారి వారి పరిధిలో మొక్కలకు నీరు పోయాలని ,ముఖ్యంగా హరితహారం కార్యక్రమం లో నాటిన మొక్కలకు నీరు పోయటమే కాకుండా, ఆయా సంస్థలు, ఇళ్లల్లో పెంచుకుంటున్న మొక్కలకు కూడా నీరు పోసినట్లయితే ఎండాకాలం మొక్కలు చనిపోకుండా కాపాడుకున్న వారమవుతామని అన్నారు. మొక్కల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ,మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. .ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు అందించే కార్యక్రమం లో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తన క్యాంపు కార్యాలయంలో మొక్కలకు నీరు పెట్టారు.