మొక్కలను సంరక్షించుకోవాలి..... ఎం పి డి ఓ రాఘవ.....

మొక్కలను సంరక్షించుకోవాలి.....  ఎం పి డి ఓ రాఘవ.....  నర్సరీలలో ఉన్న మొక్కలను నీరు పోసి స0రక్షించుకోవాలని ఎంపీడీవో రాఘవ తెలిపారు. మండలంలో ఉన్న చిన్న లింగాల్ చెడ్ గ్రామపంచాయతీ లో గ్రామసభ నిర్వహించారు.  ఈ సమావేశంలో గ్రామంలో ఉన్న అభివృద్ధి పనుల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు హరితహారం ద్వారా నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. ప్రజలందరూ మాస్కులు ధరించి కరోనా వ్యాధి మహమ్మారిని  దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  అదేవిధంగా గ్రామంలో ఉన్న నర్సరీలను, డంపింగ్ యార్డ్ , స్మశాన వాటిక ను ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ బాలయ్య, పంచాయతీ సెక్రెటరీ శ్రీలత, గ్రామ పెద్ద ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.