ఎమ్మెల్యే ఆల పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం...అనవసరమైన ఆరోపణలు మానుకొని బహిరంగ చర్చకు రా...
ఎమ్మెల్యే ఆల పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం...అనవసరమైన ఆరోపణలు మానుకొని బహిరంగ చర్చకు రా...ఎక్కడ అవినీతికి పాల్పడ్డారు ఎక్కడ కమిషన్లకు పాల్పడ్డాడు దమ్ముంటే నిరూపించు....కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఆల పై చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలి.టిఆర్ఎస్ పార్టీ ఎంపిపి సూది రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కోట రాములు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మోహన్ గౌడ్ దేవరకద్ర నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి జి మధుసూదన్ రెడ్డి చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ సూది రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోట రాములు, సర్పంచుల సంఘం అధ్యక్షులు మోహన్ గౌడ్ లు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ. దేవరకద్ర నియోజకవర్గంలోని రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి కోసం పని చేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై అనవసరమైన ఆరోపణలు చేయడం తగదని వారు అన్నారు. మండలంలో ఉన్న ఒక చెట్టు వాగుపై 9 చెక్ డ్యాం లకు 42 రెండు కోట్ల నిధులను తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కే దక్కిందని వారు అన్నారు. అదేవిధంగా అల్లిపూర్ గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మిస్తే పదిహేను వందల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా భావిస్తూ చెక్ డాం నిర్మించడం జరిగిందని వారు అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఒక చెట్టు వాగుల్లో ఒక్క చెక్ డ్యామ్ ఆయన నిర్మించిన ఘనత ఉందా అని వారు ప్రశ్నించారు . అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాని కి ఉందా అని అన్నారు . నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చెరువులకు ఒక చెట్టు వాగుల ద్వారా నీరు నిల్వ నిలపడం రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక తన పబ్బం గడుపుకోవడం నికి ఓటు బ్యాంకును సంపాదించుకోవడానికి అనేక రకాలుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదని ప్రజలకు తెలుసని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో యాసంగి పంట కు 2550 ఎకరాలకు పంటలు వేస్తే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 9300 ఎకరాలకు రైతుల పంట పొలాలు వేసుకున్నారని పంటలు పండిస్తున్నారు అని ఈ అభివృద్ధి మీకు కనపడటం లేదా అని ఘాటుగా ప్రశ్నించారు. మీ నీ గౌనిపల్లి కడ్తల్ నుంచి కురుమూర్తి స్వామి జాతర వరకు ఐదు గ్రామాల చెరువులను నింపే గొలుసు కట్టు కాలువ అభివృద్ధికి కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేశారా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రెండు కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కమీషన్ల పార్టీ ఏదైనా ఉందంటే అది గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు కమిషన్లు గుర్తుకు వస్తున్నాయని వారు విమర్శించారు . ఉంద్యాల గ్రామము నుండి చిన్నచింతకుంట కు వెళ్లే ఆర్అండ్బి రోడ్డు వేసేందుకు మూడు కోట్ల 9 లక్షల రూపాయల నిధులను కేటాయించిన ఘనత ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి దక్కింది అని వారు అన్నారు. అట్టి రోడ్డును త్వరలోనే పూర్తి చేస్తామని వారు అన్నారు. ప్రతిసారి ఎమ్మెల్యేపై కాంట్రాక్టు అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఆయన కాంట్రాక్టర్ ఏ కాదు వృత్తిరీత్యా ఆయన సివిల్ ఇంజనీర్ అందుకే అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి 19 టీఎంసీల కరివేన ప్రాజెక్ట్ ను తీసుకురావడం జరిగిందని వారు అన్నారు . అదేవిధంగా
నియోజకవర్గంలోని ప్రతి చెరువులను కాల్వలను నీళ్లతో నింపుతూ సశ్యామల చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించి అభివృద్ధి కోసం ముందడుగు వేస్తున్నారని దీంతో రైతులు నీలా ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని మొక్కుతున్నారు అని వారు అన్నారు. ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై మీరు ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన ప్రజలు గమనిస్తున్నారని ఏదో ఒక సమయంలో ప్రజల మీ భరతం పడతారని వారు హెచ్చరించారు. ఇకమీదట తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఆరోపణలు ఉంటే చర్చలకు సిద్ధం కావాలని దమ్ముంటే నిరూపించుకోవాలని లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ లంకాల రాఘవేందర్ రెడ్డి, అల్లిపురం గ్రామ సర్పంచ్ రఘు వర్ధన్ గౌడ్ ఉప సర్పంచ్ లక్ష్మణ్, సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంకులు కార్యకర్తలు నీతో పాటు తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్: ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతున్న ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు కోట రాములు, మోహన్ గౌడ్.