మిషన్ భగీరథ అధికారులపై మండిపడ్డ సర్పంచులు, ఎంపీటీసీలు
మిషన్ భగీరథ అధికారులపై మండిపడ్డ సర్పంచులు, ఎంపీటీసీలు
ఎంపీపీ నాగార్జున రెడ్డి అధ్యక్షతన వాడివేడిగా జరిగిన సర్వసభ్య సమావేశం
మిషన్ భగీరథ అధికారులపై మండిపడ్డ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామలలో మిషన్ భగీరథ పైపులు లీకేజీ అయ్యాయని అధికారులు పట్టించుకోక మిషన్ భగీరథ మంచినీరు మూడు రోజులకొకసారి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులపై సర్పంచులు ఎంపీటీసీలు ధ్వజమెత్తారు అడ్డాకుల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద మునగాల చెడు ఎంపీటీసీ చంద్రయ్య సాగర్ కందూర్ సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కి భారీ లీకేజీలు ఏర్పడిన నీళ్లు వృధాగా పోతున్న అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న అధికారులు లేరని అదేవిధంగా చౌడయ్య పల్లి గ్రామంలో మూడు రోజులకొకసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని ఎండాకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ విషయాల గురించి అధికారులకు విన్నవించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మిషన్ భగీరథ అధికారులు స్పందిస్తూ త్వరలోనే అన్ని గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నీటిని అందించేందుకు తగిన ఏర్పాటు చేస్తామని మిషన్ భగీరథ అధికారి ఏడి రఘు ఎంపీపీ నాగార్జున రెడ్డి అధ్యక్షతన సభ లో వివరించారు. సర్వసభ్య సమావేశంలో మిషన్ భగీరథ పై ఎలాంటి ఫిర్యాదులు లేకుండా గ్రామాలలోని ప్రజలకు మంచి నీటిని అందించుటలో నిర్లక్ష్యం వహించకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాయి, ఎంపీడీవో మంజుల పిఎసిఎస్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.