మిడ్జిల్ మండల పరిధిలో వస్పుల షాహిద్ భగత్ సింగ్ 90వ వర్ధంతి
మిడ్జిల్ మండల పరిధిలోని వస్పుల షాహిద్ భగత్ సింగ్ 90వ వర్ధంతిని పురస్కరించుకొని ZPHS పాఠశాలలో భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మరియు TSUTFఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ.... భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి , దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గొప్ప త్యాగమూర్తి , దేశభక్తుడు భగత్ సింగ్ అని... వారి ఆశయాలను పోరాట స్ఫూర్తిని నేటి యువకులు ఆచరించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు S. బాల్ రెడ్డి C. వెంకటయ్య J. కృష్ణ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బాదేపల్లి వెంకటయ్య వెంకటేశ్వర గౌడ్ మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ గౌడ్ , లక్ష్మయ్య , విజయ భాస్కర్ , డానింగ్టన్ , ప్రియాంక , జయమని, విజయ కుమారి , శివ కుమార్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.