మహబూబ్ నగర్ ను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని తెలిపిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...
మహబూబ్ నగర్ ను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని ,అగ్నిమాపక కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రానికి ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. గతంలో జిల్లా కేంద్రంలో తాగునీటికి, విద్యుత్తు కు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అన్ని రకాలుగా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దామని, జిల్లా ఆసుపత్రి, సమీకృత నూతన కలెక్టరేట్ భవనం,పాత కలెక్టరేట్ కార్యాలయం స్థానంలో పెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నామని ,వీరన్న పేట లో వంద కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో టిడి గుట్ట ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. అగ్నిమాపక శాఖ ఏడీజీ నారాయణరావు,రీజినల్ ఫైర్ అధికారి పాపయ్య, జిల్లాఅగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, జిల్లా ఎస్ పి ఆర్. వెంకటేశ్వర్లు ,మున్సిపల్ చైర్మన్కె.సినర్సింహులు, కౌన్సిలర్లు మునీరుద్దీన్ డిసిసిబి ఉపాధ్యక్షులువెంకటయ్య , ఇతర కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.