మహబూబ్ నగర్ ను దేనికి తీసిపోని విధంగాతీర్చి దిద్దుతాం .. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ ను దేనికి తీసిపోని విధంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ లేబరేటరీ ని ప్రారంభించారు. హరితహారం కింద మొక్కలు నాటారు.అనంతరం మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  మహబూబ్ నగర్ ఆసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే 400  కోట్ల రూపాయల వ్యయంతో  మరోఆసుపత్రిని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మెడికల్ కళాశాల కు అనుబంధంగా నర్సింగ్, డెంటల్ ,ఫార్మా కళాశాల లు వస్తాయని, వైద్య రంగంలో మహబూబ్ నగర్ ను  హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వైద్యులు, బోధన సిబ్బంది భాధ్యతాయుతంగా పని చేయాలని, అదేవిధంగా విద్యార్థులు కూడా విద్యనభ్యసించిన ప్రాంతాన్ని కళాశాలను మరువద్దని కోరారు.  జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ,  ఎస్ పి ఆర్. వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ రాం కిషన్, ఆర్ డి ఓ పద్మ శ్రీ,డాక్టర్ శామ్యూల్, కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.