మహబూబ్ నగర్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనులపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం ...మంత్రి శ్రీ V. శ్రీనివాస్ ...
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనులపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్ లోని తన నివాసంలో నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ కు సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా పట్టణంలో ని జాతీయ రహదారిపై నిర్మిస్తున్న అప్పన పల్లి రెండవ బ్రిడ్జి పనులపై చర్చించారు. బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ లో భూ నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని మంత్రి జిల్లా కలెక్టర్ శ్రీ S. వెంకటరావు ను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కు అనుబంధం గా ఉన్న రహదారులను దశల వారిగా అభివృద్ధి చేయుటకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సమావేశంలో షాద్ నగర్ MLA అంజయ్య యాదవ్, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు EE బిజ్జం రాజేందర్, డిప్యూటీ EE రమేష్ లు పాల్గొన్నారు.