మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో జన్మించిన నాలుగు నెలలకే మళ్ళీ మరణించిన లేగదూడ
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో జన్మించిన నాలుగు నెలలకే మళ్ళీ మరణించిన లేగదూడ. ఎప్పటిలాగానే పొలం దగ్గర ఆవులను ఎద్దులను కట్టేసి ఇంటికి రావడం జరిగిందని ధర్మాపూర్ గ్రామానికి చెందిన నల్లమోని అంజయ్య తెలియజేశాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చిరుత పులి తమ యొక్క ఆవుల పైన విరుచుకు పడింది. పొలం దగ్గరికి వెళ్లిన కొందరు ఆవులు గంభీరంగా అరవడంతో పరుగులు తీశారు. అప్పటికే లేగదూడ పైనా దాడి చేయడం జరిగింది. రెండునెలల క్రితం నాలుగు లేగదూడలు, బర్రె దూడల పైన దాడి చేసి తినడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేగ దూడల చనిపోయినందుకు ప్రభుత్వంకి దరఖాస్తు చేసుకున్నా రా అని అడుగగా చేసుకున్నాం కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం కు సామాన్య ప్రజలు, రైతులు గుర్తుకు రారు. ఈరోజు లేగదూడల పైన దాడి చేసిన ప్రభుత్వం స్పందించడం లేదు రేపు మనుషులపైన దాడి చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందని ఆశ కూడా లేకపోయిందన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయడం లేదు. ప్రభుత్వం తొందరగా స్పందించి చనిపోయిన లేగదూడలకు డబ్బులు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పులి పట్టుకుని మా లేగదూడలను మమ్మల్ని రక్షించాలని ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.