మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ను పరిశీలించిన ఎమ్మెల్యేఆలవెంకటేశ్వర్ రెడ్డి.

 మహబూబ్ నగర్ జిల్లా:

దేవరకద్ర మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ను పరిశీలించిన  ఎమ్మెల్యేఆలవెంకటేశ్వర్ రెడ్డి.  దేవరకద్ర బస్టాండ్ కు తన నిధులు కేటాయించి అన్నివిధాల అభివృద్ధి  చేసి  సుందరంగా తీర్చిదిద్దుతామని  తెలిపారు.మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ ఉషాదేవి,డిపో మేనేజర్ అశోక్ రాజు తో కలిసి దేవరకద్ర బస్టాండ్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ బస్టాండ్ ఖాళీ స్థలంలో మినిథియేటర్ ,మినీ కల్యాణ మండపం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు.బస్టాండ్ లో మొక్కలను పెంచాలని,అలాగే సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఎంపీడీఓ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే ఆదేశించారు.
బస్టాండ్ ముందు బాగంలో పెట్రోల్ బాంక్ ఏర్పాటు కు అనుమతులు ఇచ్చామని రీజినల్ మేనేజర్ ఉషాదేవి ఎమ్మెల్యే కు తెలిపారు