మేడే స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి....

మేడే స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి....
135 వ మేడే వర్ధిల్లాలి..ప్రభుత్వ ఆస్పత్రి నుంచి భారీ ర్యాలీ మేడే సందర్భంగా కార్మికులంతా ఏకం కావాలి జెఎన్ దేవదానం ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు మేడే స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని jN దేవదానం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 135 వ మేడే ను పురస్కరించుకొని డప్పుల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలి లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది ఉన్నాయని దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు ఏకం కావాలని ఆయన ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని గతంలో చికాగో నగరంలో 8 గంటల పని దినాలు కోసం తమ ప్రాణాలను రక్త మోడీ సాధించుకున్న కార్మికుల హక్కులను ఈరోజు కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికలప్పుడు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలు గాలికొదిలేశారని మండిపడ్డారు. అందుకోసం మన సమస్యలను మనమే పరిష్కరించేందుకు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కార్మికులను ఆయన కోరారు. అనంతరం టి ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పి యాదగిరి ఆధ్వర్యంలో 135 మే డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సమైక్యం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప టి యు జిల్లా ఉపాధ్యక్షులు కోళ్ల వెంకటన్న కొండన్న అరుణోదయ సమాఖ్య జిల్లా అధ్యక్షులు చంద్రన్న ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా జిల్లా అధ్యక్షులు ఆర్ ఆర్ మన్యం పిడిఎస్యు పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి సీతారాం , బాబు శంకర్ వెంకటన్న సత్యనారాయణ వీరితోపాటు బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.