మాస్కు ధరించి కరోన వ్యాప్తిని అరికడదాం..... మహబూబ్ నగర్ జిల్లా పోలీసు....
మాస్కు ధరించి కరోన వ్యాప్తిని అరికడదాం.....
మహబూబ్ నగర్ జిల్లా పోలీసు....
కోవిడ్ నియంత్రణలో భాగంగా మాస్క్ ధరించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ శుక్రవారం అం నాడు జిల్లావ్యాప్తంగా ప్రచారం పోలీసు అధికారులు ప్రచారం నిర్వహించారు. మినీ ట్యాంక్ బండ్ రోడ్డు ఆవరణలో ప్రయాణికులకు మాస్కు ధరించాలని పోలీసులు ఆదేశించారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వలన కరోనా వంటి అంటురోగాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, విపత్తుల నియంత్రణ చట్టం మేరకు ప్రతిఒక్కరూ బాధ్యాతాయుతంగా నడుచుకోవడం అవసరమని, ఉల్లంఘించినవారికి వెయ్యి రూపాయలు జరిమానా, శిక్ష తప్పదన్న సున్నితమైన హెచ్చరికలను జారీ చేశారు . కరోనా భూతం వలన చేశారు గత సంవత్సరం ఏర్పడిన ఇబ్బందులు, కష్టనష్టాలను గుర్తెరిగి అన్ని జాగ్రత్తలు తీసుకుందామని బ్యానర్లు, చాటింపుల ద్వారా పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.