మాస్కు తప్పక ధరించాలి లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా...

మాస్కు తప్పక ధరించాలి లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా...రాజాపూర్ తహసిల్దార్ శంకర్.. ర్రాజాపూర్ మండలంలో ఉన్న ప్రజలువ్యాపారస్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మాస్కులు ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు తహశీల్దార్ శంకర్ పేర్కొన్నారు. గురువారం  రాజాపూర్ తహసిల్దార్ కార్యాలయం ముందు కొవిడ్ టాస్క్ ఫోర్స్ వెహికల్ ను  ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవిఎస్ఐ లెనిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.