మానవత్వం చాటుకున్న సహాయ పౌండేషన్ కార్యకర్తలు దిక్కులేని అనాధ కరోనా శవానికి అంత్యక్రియలు...
మానవత్వం చాటుకున్న సహాయ పౌండేషన్ కార్యకర్తలు
దిక్కులేని అనాధ కరోనా శవానికి అంత్యక్రియలు
సహాయ పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకారి శివ ప్రసాద్ యాదవ్
మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా జయమ్మ అనే వృద్ధురాలు (65) అనే వృద్ధురాలు కరోనా మహమ్మారి తో బాధపడుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈమెకు ఎవరూ లేకపోవడంతో కరోనా మహమ్మారి కి బలైన ఈమెకు అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అమ్మ పూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మల్లెల బాలరాజు సహాయ పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివ ప్రసాద్ యాదవ్ కు కు సమాచారం ఇవ్వగా వారు వెంటనే స్పందించి సహాయ పౌండేషన్ సభ్యులతో అమ్మ పూర్ గ్రామానికి చేరుకొని దిక్కులేని శవానికి హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి తో మృతిచెందిన ఐదోవ శవానికి ఈరోజు అంతక్రియలు చేయడం జరిగిందన్నారు. మా సహాయ పౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సొంతంగా మా ఖర్చులతోనే అంత్య క్రియలు చేయడం జరుగుతుందన్నారు. మా సహాయ ఫౌండేషన్ నుంచి ఎవరికైనా ఏ రకమైన బ్లడ్ కావాలి అనుకున్నా ఎక్కడికైనా వచ్చి ఉచితంగా రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడుతామని ఆయన అన్నారు. ఇప్పటికీ దాదాపు మూడు వేల మందికి రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరికైనా బ్లడ్ కావాలనుకున్నా కరోనా మహమ్మారి తో బాధపడుతూ మరణించిన వారికి సేవ చేయడానికి ముందుంటామని మాకు సమాచారం ఇవ్వాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు. సహాయ ఫౌండేషన్ కార్యకర్తలను అమ్మాపూర్ గ్రామస్తులు వారి సేవలను కొనియాడుతూ అభినందించారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా సహాయ ఫౌండేషన్ సేవలు మరువలేనివని ఇలాంటి సేవలు మరి ఎన్నో,ఎన్నో చేయాలని వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా 0 అని వారు అన్నారు. కరోనా మహమ్మారి వృద్ధురాలి అంత్యక్రియల్లో సహాయ పౌండేషన్ సభ్యులు కిషోర్ గౌడ్ పేట విజయ్ రెడ్డి అనుసంధానం రాజేష్ బుద్ధారం శివ కుమార్ గుప్త మనోజ్ గౌడ్ వెంకట్ నాయక్ కొత్త కాపు రమేష్ రెడ్డి చిటికె సందీప్ రెడ్డి వీరితో పాటు తదితరులు ఉన్నారు.