మైనింగ్ సార్ల నిర్లక్ష్యం....
మైనింగ్ సార్ల నిర్లక్ష్యం....మిడ్జిల్ మండలం లో మైనింగ్ నిర్లక్ష్యం వల్ల మండలంలోని కె ఎల్ ఐ కాలువల దగ్గర ఉన్న మోర్రం ఇష్టారీతిన తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కదలరు కాంట్రాక్టుల పేరుతో ప్రజాప్రతినిధులు ఎక్కడ తవ్విన మైనింగ్ సార్లు ఈ అక్రమాలు తెలిసిన వారిపై చర్యలు తీసుకోరు మైనింగ్ సార్లు వ్యవహరిస్తున్న తీరు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఫిర్యాదు స్వీకరించి అక్రమ వ్యాపారం చేస్తున్న మైనింగ్ అధికారుల దగరకు వెళ్లిన ఏం చేయాలో సలహాలిస్తూ కొంతమంది అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెరుగుతున్న అక్రమ మైనింగ్ పెరుగుతుందని ఎలాంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలతో తవ్వకాలు జరుపుతూ లక్షలు వెనకేసుకున్న మైనింగ్ అధికారులు ఎవరూ అటువైపుగా తొంగి చూడరు అక్రమమని తెలిసిన వారిపై కనీస చర్యలు కూడా తీసుకోరు. మిడ్జిల్ తాసిల్దార్ నిర్లక్ష్యంమండలంలోని కేఎల్ఐ శివారు గ్రామాల లో కొంత మంది అక్రమార్కులు ఇష్టారీతిగా జరుపుతున్న తాసిల్దార్, మండల అధికారులు తమకేమి అవసరం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని కొందరు రైతులు అక్రమ వ్యాపారం నడుస్తుందని తాసిల్దార్ కు సమాచారం అందించగా తాసిల్దార్ శ్రీనివాసులు సదరు వ్యాపారులకు సమాచారం తెలియజేసి రైతులకు వ్యాపారుల మధ్య కొట్లాటలు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి రైతులకు మేలు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు