మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం...! టియంయం ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు...

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం...!
టియంయం ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు...!! బ్యాగరి వెంకటస్వామి, రాష్ట్ర అధికార ప్రతినిధి.  మహబూబ్ నగర్తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 194 వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి- బ్యాగరి వెంకటస్వామి గారు" మాట్లాడుతూ... పీడిత వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు కృషి చేసిన మహానుభావుడు పూలే. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే తనని గురువుగా భావించి స్ఫూర్తిగా తీసుకున్నారంటే వారి ఆలోచనా విధానం ఏంటో అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మహాత్మ పూలే గారి ఆశయాల కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో:-  రాష్ట్ర కార్యదర్శి- ఎడ్ల కృష్ణయ్య, జిల్లా అధ్యక్షులు- పారుపల్లి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి- మిట్టమీది నాగరాజు, జిల్లా ప్రచార కార్యదర్శి- టంకర శ్రీనివాస్, హన్వాడ మండల అధ్యక్షులు- గంటి చిన్న, రెంట్ల శేఖర్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.