మహబుబ్ నగర్ – కోస్గి – తాండూర్ మరియు చించోళి మీదుగా జాతీయ రహదారి.
మహబుబ్ నగర్ – కోస్గి – తాండూర్ మరియు చించోళి మీదుగా జాతీయ రహదారి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకేల్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మూల లకు అద్భుతమైన రహదారి వ్యవస్థ ను కల్పించాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుద్యేయంగా పేట్టుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అనేక రాష్ట్ర రహదారులను కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి రహదారులుగా మార్పించారు. మహబుబ్ నగర్ టౌన్ కు అవతల వైపు భాగం హన్వాడ మండలం అభివృద్ది చేందాలంటే ఈ నూతన మహబుబ్ నగర్ – కోస్గి – తాండూర్ మరియు చించోళి మీదుగా జాతీయ రహదారి అభివృద్ది చేయవలసి ఉంది. దీనికీ గాను రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ నేషనల్ హై వే అథారిటీ కార్యదర్శి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అండ్ హై వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు లేఖ ను సంధించటం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం కు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ గారి లేఖ కు వెంటనే స్పందించిన కేంద్ర రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాష్ట్ర రహదారి ని జాతీయ రహదారి గా నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగిందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేఖ కు వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ నుండి చెంచోళీ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారి గా నోటిఫై చేసినందుకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, కేంద్ర ఉపరితల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రద్దు అయినటు వంటి దివిటి పల్లి........ భారత్ మాల స్కీమ్ రోడ్డు .....ధర్మాపూర్ వయా రాయ్ చూర్ రోడ్డును మళ్ళీ పునరుద్ధరణ చేసుకుని పనులు ప్రారంభించుకోవటానికి ఈ నాలుగు లైన్ల రోడ్డు మంజూరు అయి సిధ్దంగా ఉంది. అలాగే, జడ్చర్ల నుండి మహబుబ్ నగర్ వన్ టౌన్ పొలిస్ స్టేషన్ వరకు 171 కోట్లు రూపాయల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు ప్రారంభం అయి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహబుబ్ నగర్ టౌన్ మెయిన్ రోడ్డు జూన్ ఆఖరి వరకు పూర్తి అవుతుంది. మహబుబ్ నగర్ బై పాస్ రోడ్డు మోదటి దశ రూపాయలు 96.7 కోట్ల రూపాయలతో 5.1 కీలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగింది. మిగితా 4.5 కీలోమీటర్ల రోడ్డు పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి అధనపు నిధుల మంజూరు కోరకు సమర్పించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.*ఈ విషయం ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి దృష్టికి తీసుకేళ్ళటంతో వెంటనే స్పందించి కేంద్ర మంత్రి శ్రీ నితన్ గడ్కరీ కి.... మహబుబ్ నగర్ – కోస్గి – తాండూర్ మరియు కర్నాటక రాష్ట్రం చించోళి మీదుగా జాతీయ రహదారి ని నిర్మించాలని లేఖ వ్రాయటం జరిగింది. ఈ రోడ్డు పొడవు ముత్తం 190 కీలోమీటర్లు (126 కీలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో 64 కీలోమీటర్లు కర్నాటక రాష్ట్రంలో) ఈ రోడ్డు ను కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ కు రావాల్సిన నిధుల వాటాలోంచి వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు కేంద్ర మంత్రి గారికి వ్రాసిన లేఖలో పేర్కోనడం జరిగింది, ఇది తప్పకుండా మంజూరు చేయుంచుకుంటామని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు వెల్లడించారు.* తద్వారా వెనుకబడిన మహబుబ్ నగర్ జిల్లాలో అభివృద్దికి బాటలు వేయడం జరుగుతుంది. మరియు, జాతీయ రహదారి రావడం వల్ల అనేక పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం కల్గుతుంది, జిల్లా లో ఉపాధి అవకాశాలను కల్పించటం మెరుగుపడుతాయని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.