మద్యం మత్తులో మహిళ ఆత్మహత్య...

మద్యం మత్తులో మహిళ ఆత్మహత్య... 
 మద్యం మత్తులో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కావేరమ్మపేటలోని ఎం బి హాస్పిటల్ ప్రాంగణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కావేరమ్మపేటలోని భవాని నగర్ ప్రాంతానికి చెందిన దండు శేషమ్మ 63 అనే మహిళ గత ఐదు సంవత్సరాలుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ తాను ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉండేది. మద్యానికి బానిసైన శేషమ్మ ప్రతి రోజు మాదిరిగానే శనివారం మద్యం  మధ్యాహ్నం మూడు గంటలకు  ఇంటి నుండి వెళ్ళిపోయి,ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల  ఎంతగానో వెతికారు. అలా వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఆదివారం ఉదయం  ఎంబి హాస్పిటల్ వెనుక కూలి ఉన్న గదిలో ఆమె మృతదేహం చీర కొంగుతో ఉరి వేసుకొని కనిపించింది.ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుమారుడు శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.