మహబూబ్ నగర్ జిల్లా కవులకు, సాహిత్యానికి పుట్టినిల్లు.... జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి....

  మహబూబ్ నగర్ జిల్లా కవులకు, సాహిత్యానికి పుట్టినిల్లు అని జిల్లా పరిషత్  చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు . శనివారం రాష్ట్ర భాష సంస్కృతి శాఖ, మహబూబ్ నగర్ జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులకు ఘనంగా సన్మానించారు. స్వయంగా కవయిత్రి అయిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వతంత్ర స్ఫూర్తి పై కవితను వినిపించి సభను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మొదటి నుండి జిల్లా  సాహిత్యానికి, కవులకు పెట్టింది పేరని, కవులకు కొదవలేదని అన్నారు. ఎంతో మంది కవులు ఉన్న జిల్లాలో  తాను కవయిత్రి గా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉండడం సంతోషకరమని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం వచ్చిన తరువాత భారత దేశానికి  అందిస్తున్న సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆమె కవులను కొనియాడారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వతంత్ర భారత  అమృతోత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కవిసమ్మేళనంలో ఉత్తమంగా నిలిచిన మొదటి ఉత్తమ ముగ్గురు కవులకు శాలువ, ప్రశంసాపత్రంతో పాటు  ప్రథమ ఉత్తమ కవికి 5 వేల రూపాయల నగదు ,రెండవ ఉత్తమ కవికి 3000  రూపాయల నగదు,3 వ ఉత్తమ కవికి 2 వేల రూపాయల నగదుతో పాటు జ్ఞాపికను అందించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్, డిపిఆర్ఓ  యు.వెంకటేశ్వర్లు,ఇతర జిల్లా అధికారులు కవులను శాలువా, ప్రశంసాపత్రంతో పాటు, 1116/- నగదుతో సత్కరించారు.