లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 10 మందికి గాయాలు..

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 10 మందికి గాయాలు... రాజాపూర్   మండలం రంగారెడ్డిగూడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డుప్రమాదంసంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని బాధితులు తెలిపారు.