లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఉద్యమిస్తాం- ఏబీవీపీ డిమాండ్
లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఉద్యమిస్తాం- ఏబీవీపీ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని మహబూబ్నగర్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కన్వీనర్ మనోజ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 61 నిర్ణయాన్ని వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు పాలమూరు యూనివర్సిటీ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మనోజ్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు ,పూర్తి చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే ఈ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలలో చీకటి నింపుతూ, వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు ,అనేక కంపెనీలు ఈ రాష్ట్రంలో కి నూతనంగా వస్తున్నాయి, కానీ లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకే పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు పెంచడం కారణంగా 2024 వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ కాడు. మరి ఏ విధంగా లక్ష ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకొని లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని లేకుంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను తిరగని వ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మహేష్, నరేష్, శ్రీను, గణేష్, రాకేష్, శివ ,జగదీష్, బాబు ,రాజు, అద్నాన్ తదితరులు పాల్గొన్నారు.