కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య...

మహబూబ్ నగర్ కోటకదిర గ్రామానికి చెందిన నర్సిములు కుటుంబ కలహాలతో సోమవారం నాడు గృహంలో వురి వేసుకున్నాడు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, 55 సంవత్సరాల వయస్సు ఉన్న నర్సింలు మన్యంకొండ దేవస్థానం లో (స్వీపర్) ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు ఇరువురూ గొడవపడి జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం నాడు ఉదయం 11 గంటలకు ఉరి వేసుకున్నాడని ఫిర్యాదులు తెలియజేశారు. తన చావు పై ఎవరికీ అనుమానం లేదని మృతుడి కొడుకు నరసింహులు, కూతురు మల్లేశ్వరి ఫిర్యాదులో తెలియజేశారు.