కుల వృత్తుల వైపు మొగ్గు చూపుతున్న ప్రై"వేటు" బడుల ఉపాధ్యాయులు...

 కుల వృత్తుల వైపు మొగ్గు చూపుతున్న ప్రై"వేటు" బడుల ఉపాధ్యాయులు...

ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు
మనోధైర్యం కోల్పోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
 ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి.....కరోనా మహమ్మారి విజృంభన లో భాగంగా గత సంవత్సరము మార్చి 22 నుండి అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లాలోని ప్రైవేటు బడుల ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు . ప్రైవేటు యాజమాన్యం కూడా ఉపాధ్యాయుల పై కనికరం చూపించడం లేదు . ఉపాధ్యాయులకు  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఉపాధ్యాయులకు కొంత ఆర్థిక సహాయం చేసి మనోధైర్యం ఇస్తే బాగుంటుంది. గత సంవత్సరం మార్చి నుండి దాదాపుగా పది నెలలు జీతాలు  లేక ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యారు. ఈ సంవత్సరము మార్చి 1న పాఠశాలలో తిరిగి తెరగా చిగురించిన ఆశలు మళ్లీ ఆవిరయ్యాయి. ముఖ్యంగా ప్రైవేటు  పాఠశాలల ఉపాధ్యాయుల పై కరోనా  పెను ప్రభావం చూపింది. తమ కుటుంబ సభ్యుల బంగారం కుదువబెట్టి  కుటుంబాన్ని పోషిస్తున్న దుస్థితి లో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. పట్టణంలోని కొందరు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు కుల వృత్తులు, చిరు వ్యాపారాలు వైపు మొగ్గు చూపి వారి కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. కిరాణా షాపు నిర్వహించడం  మరియు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రైవేటు బడుల ఉపాధ్యాయులు .ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా  నోటిఫికేషన్లు ఇవ్వకపోగా, నిరుద్యోగ భృతి చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులు  భూమి అమ్మి, అప్పు చేసి మరియు బంగారం కుదువబెట్టి డి.ఎడ్/ బిఈడి, ఎంఎస్సీ కోర్సు చేయించిన కూడా ఉద్యోగం రాకపోవడంతో కొందరికి వివాహాలు కూడా జరగడం లేదు. మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసిన ఉపాధ్యాయుడికి జీవనోపాధి కష్టతరమైనది. ఉపాధ్యాయులు మనోధైర్యం కోల్పోకుండా మనోనిబ్బరం ,దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని విశ్లేషకులు అంటున్నారు. జీవితంలో కష్టాలు అనేవి తాత్కాలికమేనని గుర్తించి వాటిని అధిగమించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. తమ జీవితంలో వందల మంది విద్యార్థులకు వ్యక్తిత్వాలను మార్చి, మంచి విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం. ఉపాధ్యాయులు వారికి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవద్దని అంటున్నారు. ఉపాధ్యాయుడు అంటే నవ సమాజ నిర్మాత మరియు  మార్గదర్శకుడు  అని, ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.