క్రాంతిదర్శి,విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే- టి ఎస్ యు టి ఎఫ్...
క్రాంతిదర్శి,విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే- టి ఎస్ యు టి ఎఫ్...
మహాత్మా జ్యోతిభా పూలే 195 వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ బిసి స్టడీ సర్కిల్ కార్యాలయం ముందు ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు , జోహార్లర్పించారు.టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్.కిష్టయ్య మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అంధ విశ్వాసాలు అసమానతలు, కులవివక్షతను రూపుమాపడానికి కృషి చేసిన క్రాంతిదర్శి అని,మహిళలకు, శూద్రులకు చదువు నేర్పించి సమాజంలో వెలుగులు నింపడానికి పాఠశాలలు స్థాపించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని అన్నారు. అదేవిధంగా చాందస వాద,మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా జీవితాంతం కృషి సల్పి,సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారని, కార్మికుల హక్కుల కోసం కృషిచేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని ఆయన సేవలను కొనియాడారు.యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.వెంకటేష్ ప్రధాన కార్యదర్శి కె.రవి కుమార్ మాట్లాడుతూ, భారతజాతికి స్పూర్తినిచ్చిన మహానీయులు జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకు పోవాలంటే కులం జబ్బును నిర్మూలించాలి అన్నారు. సమానత్వాన్ని సాధించాలని, కుల వివక్షతను రూపుమాపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, రిజర్వేషన్ల పరిరక్షణకు కృషి చేయాలని, విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలని,దళిత గిరిజన బడుగు,బలహీన వర్గాలు మరియు మహిళల అభివృద్ధికి, వంద శాతం అక్షరాస్యత సాధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆశయాలు సాధించాలంటే, దండేసి దండం పెట్టడం మాత్రమే కాదు, పూలే లక్ష్యసాధనకు మనమంతా కంకణబద్ధులు కావాలని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్.కిష్టయ్య, కె.రామదాస్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేష్, కె.రవికుమార్ లతోపాటు జిల్లా ఉపాధ్యక్షులు పి. ఉమాదేవి, జిల్లా కార్యదర్శులు బి. మన్యం,సుదర్శన్ వివిధ మండలాల నాయకులు కిష్ట్యానాయక్,శివరాజ్ గౌడ్, ఎం.రాములు,రవిబాబు,రాంబాబు, ఎం.శంకరయ్య,రాములు, దేవప్ప,చంద్రశేఖర్,రాములునాయక్, జి.నరేష్ శివరాజ్ లతోపాటు టీఎస్ యుటిఎఫ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.